ఇంట్రస్టింగ్ కేసు : వాట్సాప్ బ్లూ టిక్ మార్క్.. బ్యాంక్ అప్పు కట్టించింది

wats-appబ్యాంకు నుంచి తీసుకున్న అప్పు కానీ, క్రెడిట్ కార్డు బిల్లుగానీ చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారా! బ్యాంక్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకుండా, మీ ఇంటి అడ్రస్ ను మార్చివేయడం వంటివి చేస్తున్నారా, అయితే ఇలాంటి వారి చేత ముక్కుపిండి అప్పు వసూల్ చేయడం ఎలాగో బ్యాంకు వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య మరీ. అప్పు ఎగ్గొట్టి ఇంటి అడ్రస్ ను మార్చి దర్జాగా తిరుగుతున్న ఓ వ్యక్తిని వాట్సాప్ పట్టించింది. అంతేకాకుండా అతడి వాట్సాప్ అతడితో బిల్లు కట్టించింది. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా…

ముంబైకి చెందిన రోహిత్ జాదవ్ 2010లో SBI బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డు తీసుకున్నాడు. రూ.85 వేల వరకూ ఖర్చు చేశాడు. వడ్డీతో కలిపి రూ.1.17 లక్షలు అయింది. అప్పటి నుంచి రోహిత్ ఫోన్ నంబర్లను మారుస్తూ ఇంటి అడ్రస్ మారుస్తున్నాడు. దీంతో రోహిత్ కు లీగల్ నోటీస్ అందజేయడం కష్టం అయ్యింది. చివరికి రోహిత్ ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేసిన బ్యాంక్ అధికారులు అతనికి వాట్సాప్‌ లో PDF ఫైల్ ద్వారా లీగల్ నోటీస్‌ పంపారు. దాన్ని అతను ఓపెన్ చేయగా.. అందులో బ్లూ టిక్స్ మెసేజ్ వచ్చింది. దీంతో ఆ మెసేజ్‌ స్క్రీన్ షాట్ తీసి బ్యాంక్ తన దగ్గర ఉంచుకుంది. ఈ బ్లూ టిక్స్ ఆధారంగా బాంబే హైకోర్టులో రోహిత్ పై బ్యాంక్ కేసు వేసింది. తాము పంపిన లీగల్ నోటీస్‌ జాదవ్ చూశాడని, దానికి వాట్సాప్‌ లో ఉన్న బ్లూ టిక్స్ సాక్ష్యం అని బ్యాంక్ ప్రతినిధులు స్క్రీన్ షాట్‌ ను కోర్టుకు సమర్పించారు. కోర్టు దాన్ని ఆమోదించింది. డిజిటల్ మీడియా ద్వారా పంపే మెసేజ్‌ లేదా లీగల్ నోటీసుల వంటి డాక్యుమెంట్లు చట్ట ప్రకారం చెల్లుతాయని స్పష్టం చేసింది. వాటిని లోన్ కట్టవలసిన వ్యక్తి  స్వీకరించినట్లు వాట్సాప్‌లో బ్లూ టిక్ తెలియజేస్తుంది కనుక.. అది కూడా చెల్లుతుందని కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో రోహిత్ కోర్టులో హాజరు కావాలని, బ్యాంక్ కు చెల్లించాల్సిన బిల్లును వడ్డీతో కలసి కట్టాలని బ్యాంక్ తీర్పు చెప్పింది. లేకపోతే జైలుకి పంపాల్సి వస్తుందని హెచ్చరించింది.

Posted in Uncategorized

Latest Updates