ఇండస్ట్రీ ఉద్యమం : సినిమా థియేటర్లు బంద్

cinema theaters closedసినిమా థియేటర్లు అన్నీ మూసివేయాలని నిర్ణయించింది ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల ఫిల్మ్ ఛాంబర్స్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు మొత్తం కలిసి డెసిషన్ తీసుకున్నాయి. మార్చి 2వ తేదీ నుంచి నిరవధికంగా ఈ బంద్ పాటిస్తున్నాయి. సింగిల్ థియేటర్లతోపాటు మల్టీఫ్లెక్సుల్లోనూ షోలు వేయరు.

డిమాండ్లు ఏంటీ :

వర్చ్యువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్) పేరుతో భారీగా వసూలు చేస్తున్నారని నిర్మాతలు, పంపిణీదారులు అంటున్నారు. అదే విధంగా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ (డీఎస్ పీ) రెచ్చిపోతున్నారని.. గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా కంటెంట్ తీసుకుని డిజిటల్ గా వాడుకుంటూనే.. మాపైనే పెత్తనం చెలాయిస్తున్నారనేది నిర్మాతల ఆరోపణలు. దక్షిణాది రాష్ట్రాల ఫిల్మ్ చాంబర్స్ అన్నీ కలిపి బంద్ నిర్ణయం తీసుకున్నాయని తెలుగు ఫిల్మ్ చాంబరన్ అధ్యక్షుడు కిరణ్ ప్రకటించారు. క్యూబ్, యూఎఫ్ వో ప్రతినిధులతో చర్చలు జరిపినా ఫలితం లేదన్నారు. ప్రస్తుతం వర్చ్యువల్ ప్రింట్ ఫీజులో 25శాతం తగ్గించాలన్న డిమాండ్ ను అంగీకరించలేదని వెల్లడించారు. కేవలం 9శాతం తగ్గింపునకు ఆయా సంస్థలు అంగీకరించాయి. ఇక నుంచి క్యూబ్ – యూఎఫ్ వో లకు కంటెంట్ కూడా ఇవ్వకూడదని నిర్ణయించారు.

Posted in Uncategorized

Latest Updates