ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం

ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. 180 మంది ప్రయాణీకులతో వెళ్తున్న విమానం అత్యవసరంగా రన్ వే పైన ఆగిపోయింది. విమానం టేకాఫ్ అవుతుండగా ఓ వాహనం ఆ విమానం ముందుకు వచ్చింది. దీనిని గుర్తించిన పైలట్లు అలర్టై వెంటనే విమానాన్ని నిలిపేశారు. ఇండిగో ఎయిర్ బస్ ఏ320 టేకాఫ్ అవుతుండగా రన్ వే పైన ఓ వాహనాన్ని అందులోని ఇద్దరు పైలట్లు గుర్తించారు. దీంతో ఆ వాహనం ప్రమాదం నుంచి తప్పించేందుకు ఎమర్జెన్సీ బ్రేకులు ఉపయోగించారు. ఈ సంఘటన మంగళవారం (అక్టోబర్-9) ఉదయం హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో జరిగింది. ఇండిగో విమానం ప్రతి రోజు హైదరాబాద్ నుంచి గోవాకు ట్రిప్పులు నడుపుతోంది.

 

Posted in Uncategorized

Latest Updates