ముంబై-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ముంబయి: ముంబై నుంచి ఢిల్లీ మీదుగా లక్నో వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఒక్కసారిగా అలజడి రేగింది. విమానంలో బాంబు పెట్టారంటూ సమాచారం రావడంతో… అందరూ హడలిపోయారు. టేకాఫ్ కాబోతున్న విమానాన్ని అధికారులు మళ్లీ.. జనం లేని.. సెకండరీ లాడర్ పాయింట్ దగ్గర నిలిపేశారు.  తనిఖీల తర్వాత అందులో ఎలాంటి బాంబు లేదని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు.

ఇండిగో విమానం ఇవాళ(శనివారం) ఉదయం ఆరు గంటల 5 నిమిషాలకు ముంబై విమానాశ్రయం నుంచి బయల్దేరాల్సి ఉంది. గో ఎయిర్ ఫ్లైట్ G8 329 విమానంలో ఢిల్లీకి వెళ్లాల్సిన ఓ మహిళ … ముంబై-ఢిల్లీ ఇండిగో ఫ్లైట్ లో ఎవరో బాంబ్ పెట్టారని అధికారులకు చెప్పింది. తనకు డౌట్ గా ఉందని.. తాను తీసిన కొన్ని ఫొటోలను అధికారులకు చూపించింది. అలా అలర్ట్ అయిన బాంబ్ స్క్వాడ్ టీమ్.. వెంటనే ప్యాసింజర్లను ఫ్లైట్ నుంచి దింపేసింది. తనిఖీల్లో ఏమీ లేదని తేల్చారు. మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఫ్లైట్ ముంబై ఎయిర్ పోర్ట్ టెర్మినల్ 1 నుంచి 8.40 సమయానికి బయల్దేరింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయానికి 10.45కి ల్యాండ్ అయింది. రెండు గంటల 25 నిమిషాలు ఆలస్యంగా ఢిల్లీకి చేరింది.

Posted in Uncategorized

Latest Updates