ఇండియన్ ఏరోస్పేస్ సిస్టంను కేంద్రం నాశనం చేసింది : రాహుల్

బెంగళూరు: రాఫెల్ వివాదం పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహల్ గాంధీ కేంద్రం పై మరోసారి ఫైర్ అయ్యారు. ఇండియన్ ఏరోస్పేస్ సిస్టంను కేంద్రం నాశనం చేసిందని.. రాఫెల్ ఒప్పందంలో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) ను ఎందుకు భాగస్వామి చేయలేదని క్వశ్చన్ చేశారు. రాహుల్ ఇవాళ(అక్టోబర్-13) సంస్థ ఉద్యోగులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ ఒప్పందం నుంచి HALను తొలగించి ఏరోస్పేస్ రంగంలో దేశ భవిష్యత్తును మోడీ సర్కార్ నాశనం చేసిందన్నారు. HAL భారత వ్యూహాత్మక సంపద అని రాహుల్ తెలిపారు. ఇండియా, చైనాలు మాత్రమే అమెరికాను సవాలు చేయగలవని దానికి HAL  కారణమంటూ అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా గతంలో చేసిన వ్యాఖ్యలను రాహుల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్తులో సంస్థను మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దడంపై తాను దృష్టిసారించాలని అనుకుంటున్నట్టు చెప్పారు.

 

 

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates