ఇండియన్ నేవీలో సివిలియన్ ఉద్యోగాలు

INDIAN-NAVYభారత నావికా దళంలో సివిలియన్ పర్సనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింది. ప్రస్తుతం భర్తీ చేసే ఖాళీలు సదరన్ నేవల్ కమాండ్ పరిధిలోని యూనిట్లలో ఉన్నాయి.

పోస్టు: గ్రూప్ సీ పోస్టులు

మొత్తం ఖాళీలు: 74

విభాగాల వారీగా ఖాళీలు: ఫైర్ ఇంజిన్ డ్రైవర్ – 3, గ్రేడ్ -II టెలిఫోన్ ఆపరేటర్ -2, గ్రేడ్ – I/II ఫైర్‌మ్యాన్ – 27, ఫొటో ప్రింటర్ – 1, గ్రేడ్ -II సినిమా ప్రొజెక్షనిస్ట్ – 2, కుక్ – 5, బేరర్ – 3, పెస్ట్ కంట్రోల్ వర్కర్- 12, గ్రూమ్ – 17, శాడ్లర్ – 2 ఖాళీలు ఉన్నాయి.

వేతనం: ఫైర్ ఇంజిన్ డ్రైవర్స్, టెలిఫోన్ ఆపరేటర్ పోస్టులకు – రూ. 21,700 – 69,100/-
…ఫైర్‌మ్యాన్, ఫొటో ప్రింటర్, సినిమా ప్రొజెక్షనిస్ట్, కుక్ పోస్టులకు – రూ. 19,900 – 63,200/-
…బేరర్, పెస్ట్ కంట్రోల్ వర్కర్, గ్రూమ్, శాడ్లర్ పోస్టులకు – రూ. 18,000 – 56, 900/-

అర్హతలు: ఫైర్ ఇంజిన్ డ్రైవర్స్ -10వ తరగతిపాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. హెవీ వెహికిల్స్ నడపటంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.

టెలిఫోన్ ఆపరేటర్లు: పదోతరగతి/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత. ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. పీబీఎక్స్ బోర్డు నిర్వహణలో ప్రావీణ్యం ఉండాలి. ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడాలి.
మిగిలిన అన్ని పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణత. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
పనిచేయాల్సిన ప్రదేశాలు: కొచ్చిన్, కొచ్చి, ఎర్నాకుళం
ఎంపిక విధానం : 
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ : అర్హత ఉన్న అభ్యర్థులకు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం టెస్ట్‌ను నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించినవారికి మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చివరితేదీ: ఏప్రిల్ 9

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

The Flag Officer Commanding-in-
Chief, (for Civilian
Recruitment Cell),
Headquarters Southern Naval
Command, Kochi- 682004.

వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in

Posted in Uncategorized

Latest Updates