ఇండియాలో ఫస్ట్ టైం:  హైదరాబాద్ లో ఒప్పో ఆర్ అండ్ డి సెంటర్

చైనాకు చెందిన మొబైల్ కంపెనీ దిగ్గజం ఒప్పో.. ఇండియాలో ఫస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్( ఆర్ అండ్ డి)  సెంటర్ ను హైదరాబాద్ లో ప్రారంభించనుంది. తమ స్మార్ట్ ఫోన్ యూజర్లకు.. లేటెస్ట్ టెక్నాలజీతో పాటు నూతన ఆవిష్కరణలను మరింత మెరుగ్గా అందించేందుకు  ఈ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని ఒప్పో ఇండియా ప్రెసిడెంట్ చార్లెస్ వాంగ్ తెలిపారు. మొబైల్ సాఫ్ట్‌వేర్ డిజైన్, డెవలప్‌మెంట్‌లో దాదాపు 15 ఏళ్ల అనుభవం ఉన్న తస్లీమ్ ఆరీఫ్ ను ఈ సెంటర్ కు హెడ్ గా నియమిస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆరు ఆర్ అండ్ డి సెంటర్లు ఉన్నాయని.. హైదరాబాద్ లో ప్రారంభమయ్యేది 7వ సెంటర్ అని వాంగ్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates