ఇండియా టాప్ : ఫేస్ బుక్ లో 20కోట్ల ఫేక్ అకౌంట్లు

FAKE BOOKసామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో 20 కోట్ల ఫేక్ అకౌంట్లు ఉన్నట్లు తేలింది. ఆ సంస్థ ప్రకటించిన 2017 డిసెంబర్‌ నాటి వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నకిలీ ఖాతాలు అధికంగా భారత్‌లోనే ఉన్నట్లు వెల్లడించింది. 2017 నాలుగో త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంత్లీ ఆక్టివ్‌ యూజర్లు (MAU)లలో 10 శాతం ఫేక్ అకౌంట్లే అని అంచనా వేసింది. అలాగే ఈ ఫేక్ అకౌంట్లున్న దేశాల్లో తొలి స్థానాల్లో ఇండియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌ ఉన్నట్లు తెలిపింది. 2017 చివరి నాటికి మొత్తం 2.13 బిలియన్ల MAUలు ఉన్నారని, 2016తో పోలిస్తే 14 శాతం MAUలు పెరిగారని తెలిపింది. 2017లో ఖాతాలు పెరగడానికి భారత్, ఇండోనేసియా, వియత్నాం దేశాలే కారణమని వివరించింది. ఒక వాడకందారుడికి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలుంటే.. అందులో మొదటి ఖాతా మినహా మిగతావన్నీ నకిలీవేనని స్పష్టం చేసింది.

Posted in Uncategorized

Latest Updates