ముగ్గురి సెంచరీలు.. విండీస్ ను ఆటాడుకున్నారు.. భారత్ 649/9 డిక్లేర్డ్

రాజ్ కోట్ : వెస్టిండీస్ తో జరుగుతున్న తొలిటెస్ట్ లో టీమిండియా దుమ్మలేపింది. ఫస్ట్ ఇన్నింగ్స్ ను 649/9 దగ్గర డిక్లేర్ చేసింది. సెకండ్ డే లంచ్ బ్రేక్ తర్వాత కెప్టెన్ కోహ్లి భారత్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. ఈ మ్యాచ్ లో భారత్ ఆటగాళ్లు.. మొత్తం మూడు సెంచరీలు, రెండు భారీ హాఫ్ సెంచరీలు నమోదుచేశారు.

4 వికెట్ల నష్టానికి 364 పరుగులతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ తమ జోరు కొనసాగించారు. రిషభ్ పంత్ 57 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. ఆ తర్వాత.. కోహ్లీ కూడా 184 బాల్స్ లో 7 ఫోర్లతో సెంచరీ పూర్తిచేశాడు. ఇది కోహ్లీకి టెస్ట్ కెరీర్ లో 24వ సెంచరీ. ఈ ఇన్నింగ్స్ తోనే టెస్టుల్లో ఈ ఏడాది వెయ్యి పరుగులు పూర్తిచేసిన ఘనత సాధించాడు.

వేగంగా ఆడిన రిషభ్ పంత్… 4 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో 84 బాల్స్ లోనే 92 రన్స్ చేసి ఔటయ్యాడు. తన స్వభావానికి విరుద్ధంగా స్లోగా ఆడిన విరాట్ కోహ్లీ.. 230 బాల్స్ లో 139 రన్స్ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా… టెయిలెండర్ల సాయంతో… భారీ షాట్లతో స్కోరు ఉరుకులు పెట్టించాడు. ఆరు వందల మార్క్ దాటించాడు. వడివడిగా సెంచరీ దిశగా కదిలాడు. ఒకరి తర్వాత ఒకరు ఔట్ అవతుండటంతో… జడేజా సెంచరీ అవుతుందా లేదా అనే ఆసక్తి పెరిగింది. అశ్విన్(7), కుల్దీప్(12), ఉమేష్ యాదవ్(22), షమీ(2 నాటౌట్)ల సాయంతో… 5 ఫోర్లు.. 5 సిక్సర్లతో.. జడేజా సెంచరీ చేశాడు. ఆ వెంటనే 649/9 స్కోరు దగ్గర ఇన్నింగ్స్ ను కోహ్లీ భారత తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన యంగ్ క్రికెటర్ పృథ్వీ షా… మొదటిరోజు చెలరేగి ఆడి 134 రన్స్ చేసి పలు రికార్డులు క్రియేట్ చేశాడు.

 

 

Posted in Uncategorized

Latest Updates