ఇండియా-పాక్ బార్డర్ లో.. రాజ్ నాథ్ దసరా వేడుకలు

న్యూఢ్లిలీ: ఈ సారి దసరా వేడుకలను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ భారత జవాన్లతో కలిసి జరుపుకోనున్నారు. ఇండియా-పాక్ బార్డర్ ప్రాంతమైన బికనీర్‌ లో BSF జవాన్లతో కలిసి రాజ్‌నాథ్ దసరా వేడుకలో పాల్గొంటారని తెలిపాయి హోంశాఖ వర్గాలు. జవాన్లతో కలిసి అక్టోబర్- 19న ఆయుధ పూజ నిర్వహించనున్నట్లు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఆయుధపూజలో పాల్గొనడం ఇదే మొదటిసారి అని తెలిపారు జవాన్లు. ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు భారత జవాన్లు.

Posted in Uncategorized

Latest Updates