ఇండోనేషియాను ముంచెత్తిన సునామీ

ఇండోనేషియా తీరాన్ని భారీ సునామీ వణికించింది. శనివారం రాత్రి  సునామీ ధాటికి 43 మంది మరణించగా 600 మంది వరకు గాయపడ్డారని సమాచారం. ఎగిసిపడిన అలల ధాటికి పలువురు గల్లంతయ్యారన్నారు అధికారులు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటున్నారు అధికారులు. జావా, సుమత్రా దీవుల మధ్యలోని సుండా జలసంధిలో ఈ సునామీ ఏర్పడింది. సముద్ర గర్భంలోని అగ్నిపర్వతం పేలడంతో భూకంపం సంభవించిందన్నారు అధికారులు. మొదట ఫుల్ మూన్ కారణంగా అలలు ఎగిసిపడుతున్నాయని భావించిన అధికారులు తర్వాత సునామీగా నిర్ధారించారు. సునామీతో వందలాది సంఖ్యలో భవనాలు నేల మట్టం కాగా…సహాయక బృందాలు శిథిలాల తొలగింపులో నిమగ్నమయ్యారు.

Posted in Uncategorized

Latest Updates