ఇండోనేషియాలోభారీ భూకంపం: రిక్టర్ స్కేల్ పై 7.7తీవ్రత

డోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. భూకంప లేఖనిపై తీవ్రత 7.7గా నమోదైంది. శుక్రవారం (సెప్టెంబర్-28) సాయంత్రం సెంట్రల్ సులావెసి దీవి సమీపంలో భూకంపం రావడంతో ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు పెట్టారు. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.ఇండోనేషియాలో విపత్తు నిర్వహణ శాఖ అధికారులు ముందస్తు సునామీ హెచ్చరికలు కూడా జారీచేశారు. ప్రజలందరినీ ఎత్తయిన ప్రదేశాలకు తరలిస్తున్నారు.

శుక్రవారం తెల్లవారు జామున ఇదే ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభించింది. భూకంపం తీవ్రతకు ఒకరు మృతి చెందగా…10 మంది గాయపడ్డారు. భారీ సంఖ్యలోఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు కనసాగిస్తుండగానే సాయంత్రం మరోసారి భూకంపం రావడంతో స్థానికులు భయందోళనకు గురయ్యారు.

Posted in Uncategorized

Latest Updates