ఇండోనేషియాలో కంపించిన భూమి: రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.4

ఇండోనేషియాలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. ఆదివారం(జూలై-29) ఉదయం లోమ్ బాక్ దీవిలో సంభవించిన ఈ భూకంపం ధాటికి అనేక ఇళ్లు కుప్పకూలాయి. భూకంప తీవ్రత ఎక్కవగా ఉండటంతో జనం భయంతో ఇళ్లల్లోంచి బయటికి పరుగులు తీశారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఐదుగురు వ్యక్తులు చనిపోగా…24 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు చెబుతున్నారు స్తానికులు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 7 కిలోమీటర్ల లోపల ఉన్నట్లు గుర్తించారు. అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. సుమారు 40 సార్లు భూ ప్రకంపనలు నమోదైనట్లు స్థానిక అధికారులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates