ఇండోనేషియాలో సునామీ…834కి చేరిన మృతుల సంఖ్య

ఇండోనేసియాలోని పాలూ సిటీలో సునామీ భీభత్సం  కారణంగా…. మరణించిన వారి సంఖ్య ఆదివారానికి 834కు చేరుకుంది. వందలాది మంది తీవ్రగాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తమ కుటుంబీకుల యోగక్షేమాలు తెలియక రోదిస్తున్న వారితో పాలూ నగరంలో భీతావహ వాతావరణం ఏర్పడింది.

 

శుక్రవారం సాయంత్రం సులవేసి దీవిలోని పాలూ సిటీలో స్థానికులు బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహణ ఏర్పాట్లు చేస్తోన్న సమయంలో ఒక్కసారిగా సునామీ ముంచెత్తింది. 20 అడుగుల ఎత్తులో అలలు విరుచుకుపడ్డాయి. దీంతో ఎత్తైన భవనాలు నేలకూలిపోయాయి. సునామీ బీభత్సంతో వందలాది మంది గల్లంతయ్యారు. కొన్నిచోట్ల మృతదేహాలు నగర వీధుల్లో తేలియాడాయి. హాస్పిటల్స్ అన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. కొన్ని ఆసుపత్రులు కూడా కూలిపోవడంతో బయట టెంట్లు వేసి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.17 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates