ఇండోనేషియా టోర్నీ : క్వార్టర్ ఫైనల్ కు సింధు

SINDHUఇండోనేషియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్‌ కు దూసుకెళ్లింది. గురువారం (జూలై-5) జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రి క్వార్టర్స్‌లో సింధు 21-17, 21-14  తేడాతో అయా ఒహొరి(జపాన్‌)పై విజయం సాధించి, క్వార్టర్స్‌ బెర్తును ఖాయం చేసుకున్నారు.  మొత్తం 36 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌ లో సింధూ ఒహొరిపై వరుసగా రెండు గేమ్స్‌ లో విక్టరీ సాధించారు. క్వార్టర్స్‌ లో సింధు..థాయ్‌లాండ్‌ కు చెందిన బుసానన్‌ ఒన్‌ గ్బారుంగ్‌ ఫాన్‌ తో కానీ.. చైనాకు చెందిన బింగ్జియాతో కానీ తలపడనుంది.

 

Posted in Uncategorized

Latest Updates