ఇండోర్ మృతులకు 2 లక్షల నష్టపరిహారం… సీఎం చౌహాన్

bu;lశనివారం(మార్చి31) రాత్రి 9:20 గంటల సమయంలో మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో ని సర్వటే ఏరియాలో ఉన్న ఓ మూడంతస్థుల హోటల్ బిల్డింగ్ కూలి 10 మంది చనిపోయారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఒక్కొక్కరికి 2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌. ఈ ఘటనలో గాయాలపాలైనవారికి  50 వేలు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా అధికారులను చౌహాన్ ఆదేశించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారందరినీ బయటకు తీసే వరకూ సహాయక చర్యలు కొనసాగించాలని అధికారులను చౌహాన్ ఆదేశించారు.‌ ఈ ప్రమాద ఘటనపై ఈ రోజు(ఏప్రిల్ 1) ఇండోర్ జిల్లా కలెక్టర్ న్యాయ విచారణకు ఆదేశించారు.

శనివారం రాత్రి వేగంగా వచ్చిన ఓ కారు సర్వేట బస్టాండు సమీపంలో ఉన్న నాలుగంతస్తుల హోటల్‌ బిల్డింగ్ ను ఢీకొట్టింది. బిల్డింగ్ పురాతనమైనది కావడంతో  గోడలకు బీటలు వచ్చి  కూలిపోయి ఉండవచ్చని ఇండోర్‌ డీఐజీ హరినారాయణ మిశ్రా అనుమానం వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates