ఇంత దారుణమా : ఫోన్ కొట్టేశాడని.. చచ్చేలా కొట్టారు

phone-theftఆ యువకుడు చేసింది తప్పే.. ముమ్మాటికీ సమర్ధించే విషయం కాదు.. అయితే దానికి ఇంత దారుణమైన శిక్ష విధించటం అనేదే ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఆ యువకుడి పేరు అమరేష్ కుమార్ సాన్హీ. బీహార్ రాష్ట్రం దర్భాంగా జిల్లాలోని హింగోలి గ్రామం. గ్రామంలోని ఓ వ్యక్తి సెల్ ఫోన్ దొంగిలించాడు అనేది అతడిపై అనుమానం. అంతే ఊరంతా కలిసి దొంగను చేసేశారు. వెంటనే గ్రామం నడిబొడ్డుకి తీసుకొచ్చారు. యువకుడిని దారుణంగా కొట్టారు. ఎంతలా అంటే చచ్చేలా. అంతటితో ఆగలేదు. ఓ క్రేన్ కు యువకుడికి గొలుసులతో కట్టేశారు. తలకిందులుగా వేలాడ తీశారు. కర్రలతో కొట్టారు.
రక్తం కారుతున్నా వారి మనసు కరగలేదు. వారిలో మరింత కసి రగిలింది. ఉన్మాదులుగా ప్రవర్తించారు. గ్రామంలోని వారందరూ సినిమా చూసినట్లు చూశారు.. ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటన రెండు, మూడు నెలల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పోలీసులు విచారణ చేపట్టారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates