ఇంద్రకీలాద్రిపై ఉద్రిక్తత : నాయిబ్రహ్మణుడిపై పాలక మండలి దాడి

VJA DURGAవిజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పాలకమండలి సభ్యుడు పెంచులయ్య నాయిబ్రహ్మణుడిపై చేయి చేసుకోవటంతో ఆందోళనకు దిగారు సంఘం సభ్యులు. పెంచులయ్య వ్యవహారంపై మండిపడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పాలకమండలి ఛైర్మన్ గౌరంబాబు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. వినిపించుకోని నాయిబ్రహ్మణులు…ఆందోళన కొనసాగిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఇబ్బంది కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు..భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేట్టారు.

Posted in Uncategorized

Latest Updates