ఇంద్రాణి..ఆస్పత్రి నుంచి తిరిగి జైలుకు

indraniదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీనా బోర హత్య కేసులో నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా బుధవారం (ఏప్రిల్-11) ముంబై జేజే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి  ఆమెను నేరుగా బైకుల్లా జైలుకు తరలించారు. 46 ఏళ్ల ఇంద్రాణి ముఖర్జియా గత శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆమెను జేజే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చిన టైంలో ఇంద్రాణి అపస్మారక స్థితిలో ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మానసిక ఒత్తడిని అధిగమించేందుకు తీసుకునే మెడిసిన్‌ ఓవర్ డోస్ కావడం కారణమన్నారు. చికిత్స తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో బుధవారం డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు.

Posted in Uncategorized

Latest Updates