ఇంద్ర మూవీ టైపులో కాజేశాడు : బురిడీ జ్యోతిష్యుడు చైతన్య అరెస్టు

మెగాస్టార్ హిట్ మూవీ ఇంద్ర సినిమా ఉంది కదా.. అందులో పండిట్ వేషంలో బ్రహ్మానందం దోచుకుంటూ ఉంటాడు.. బంగారం డబుల్ చేస్తానంటూ బురిడీ కొట్టిస్తాడు. అచ్చం అలాంటి సీన్.. హైదరాబాద్ లో జరిగింది. కుండలోని బంగారం మాయం అయ్యింది.. కష్టాలు తీరతాయని వచ్చిన వ్యక్తికి పంగనామాలు పెట్టాడు జ్యోతిష్యుడు పేరుతో చెలామణి అవుతున్న రామ్ దేవ్ చైతన్య. పూర్తి వివరాల్లోకి వెళితే..

జయశంకర్ భూషణం. ఓ వ్యాపారవేత్త. కూతురు అంటే ప్రాణం. కూతురు లక్ష్మీ జ్యోతిర్మయికి దోషం ఉందని కొందరు పడింతులు చెప్పారు. వాటి పరిహారం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సమయంలో ఓ టీవీలో ఆధ్యాత్మిక కార్యక్రమం చూశాడు. అందులో రామ్ దేవ్ చైతన్య అద్భుత మహిమలతో.. తన వాక్ చాతుర్యంతో దంచేస్తున్నారు. తన కూతురి సమస్యలు కూడా అవే కావటంతో.. వెంటనే రాందేవ్ చైతన్యను సంప్రదించాడు జయశంకర్ భూషణం. సమస్య మొత్తం విన్న అతను.. పరిహారం కావాలంటే పూజలు చేయాలని చెప్పాడు. అందుకు బాగా ఖర్చు అవుతుందని కూడా నమ్మించాడు. దీనికి అంగీకరించాడు భూషణం.

బుట్టలో పడిన భూషణంపై తన కుట్ర ప్రయోగించాడు బురిడీ జ్యోతిష్యుడు చైతన్య. లిస్ట్ చెప్పారు. ఆరు బంగారు గాజులు, కొన్ని బంగారు ఆభరణాలు తీసుకురావాలని కోరాడు. దానితోపాటు రూ.21లక్షల 95వేల నగదు కూడా పూజలో ఉంచాలని చెప్పాడు. బురిడీ జ్యోతిష్యుడు చెప్పిన విధంగా జయశంకర్ భూషణం.. అన్నీ తెచ్చాడు. ఇక పూజ మొదలు పెట్టాడు. మొత్తం బంగారు ఆభరణాలు, డబ్బును ఓ పెద్ద కుండలో పెట్టాడు. దాన్ని హోమం దగ్గర ఉంచాడు. ఓ నాలుగు గంటలు పూజలు చేశాడు. ఆ తర్వాత బాధితులు మాత్రమే కొద్దిసేపు పూజలు చేయాలని.. ఆ సమయంలో ఎవరూ ఉండకూడదని చెప్పాడు. మేం మరో గదిలో ఉంటాం.. నేను చెప్పినట్లు మీరు పూజలు చేయండి చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు జ్యోతిష్యుడు రాందేవ్ చైతన్య. ఆ గంట తర్వాత కుండను తెరిచి చూశారు.. ఇంకేముందీ అందులో బూడిద ఉంది. మోసపోయినట్లు అప్పటికికానీ తెలిసుకోలేని భూషణం.. ఆ తర్వాత లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించాడు.

2016లో ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి కేసు నడుస్తోంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ S.R.నగర్ పోలీసులు చైతన్యను అరెస్ట్ చేశారు. బురిడీ జ్యోతిష్యుడు చైతన్యపై ఇదొక్క కేసు మాత్రమే కాదు.. హైదరాబాద్ లోని మిగతా పోలీస్ స్టేషన్లలో మరికొన్ని కేసులు నమోదు అయ్యి ఉన్నాయి.

Posted in Uncategorized

Latest Updates