ఇకపై ఎయిర్ పోర్ట్ లో మాతృభాషలో అనౌన్స్ మెంట్స్

న్యూఢిల్లీ: ఇండియాలోని అన్ని ఎయిర్ పోర్ట్స్ లో ఇక నుంచి మాతృభాషలో ప్రకటనలు చేయాలని సివిల్ ఏవియేషన్ డిపార్ట్ మెంట్ ఆదేశించింది. దీనికి సంబంధించి నిన్న(బుధవారం) దేశంలోని అన్ని ఎయిర్ పోర్ట్స్ కు  ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ఇండియా (ఏఏఐ) పరిధిలో పని చేస్తున్న ప్రతి ఒక్క ఎయిర్ పోర్ట్ లో ముందు మాతృభాషలో ప్రకటలను చేసి తర్వాత ఇంగ్లిష్ , హిందీలో చేయాలని కేంద్రమంత్రి సురేశ్ ప్రభు ఆదేశాలు జారీ చేసినట్లు ఏవియేషన్ అధికారులు చెప్పారు. ప్రైవేట్ ఎయిర్ పోర్ట్ ఆపరేటర్స్ కు కూడా ఉత్తర్వులను పంపామని తెలిపారు. సైలెంట్ ఎయిర్ పోర్ట్స్‌‌ కు ఇది వర్తించదని అధికారులు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates