ఇక అవసరం లేదు: ఎగవేత రుణాలపై SBI సంచలన నిర్ణయం

sbi-1భారతీయ స్టేట్ బ్యాంక్(SBI) సంచలన నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ నుంచి వేల కోట్లలో రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించని రుణాలను మొండి బకాయిలుగా పరిగణిస్తూ భారతీయ స్టేట్ బ్యాంకు వాటిని రద్దు చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు(PSB) రూ. 81,683 కోట్ల ఎగవేత బాకీలను రద్దు చేశాయి. వీటిలో అత్యధికంగా ఎస్‌బీఐ రూ 20,339 కోట్లను ఎగవేత బాకీలుగా తేల్చేసి చేతులు దులుపుకుంది. 2012-13లో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు రద్దు చేసిన మొత్తం రూ. 27,231 కోట్లుగా గవర్నమెంట్ డేటా చెబుతోంది. ఎస్‌బీఐతో పాటు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 2016-17లో రూ. 9205 కోట్లను, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ. 7346 కోట్లు, కెనరా బ్యాంక్‌ రూ. 5,545 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ. 4348 కోట్ల ఎగవేత బాకీలను రద్దు చేశాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల్లో బ్యాంకులు రద్దు చేసిన రుణాల మొత్తం రూ 53,625 కోట్లకు పెరిగింది.

Posted in Uncategorized

Latest Updates