ఇక ఆటలు సాగవు : కల్తీ కంత్రీలకు జీవితాంతం జైలు

Food-Adulteration jailఅది టీ పొడి కాదు.. రంపపు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు అరటి బెరడు, మిరియాలు కాదు బొప్పాయి గింజలు, ధనియా పౌడర్ కాదు ఊక, జీలకర్ర కాదు గడ్డి గింజలు, కారంలో ఇటుకపొడి, పాలు కాదు ఆయిల్, సర్ఫ్, గోధుమ పిండి కాదు గంజిపిండి, ఇంగువ కాదు చాక్ పీస్ పొడర్.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ప్రతిదీ కల్తీనే.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే కల్తీ కంత్రీగాళ్లపై ఉక్కుపాదం మోపుతోంది కేంద్రం. ప్రస్తుతం ఉన్న చట్టాన్ని సవరిస్తూ.. ఇక నుంచి జీవిత ఖైదు శిక్షతోపాటు రూ.10లక్షల జరిమానా విధించాలని నిర్ణయించింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ మేరకు కేంద్రానికి సిఫార్స్ చేసింది.

ప్రస్తుతం కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న, విక్రయిస్తున్న వారికి గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తున్నారు. FSSAI యాక్ట్ సెక్షన్ 59 ప్రకారం ఇప్పటి వరకు ఈ శిక్షలు అమలు చేసేశారు. చట్ట సవరణలో భాగంగా ఇక నుంచి కల్తీ ఆహారం తయారు చేసే వ్యక్తులు, విక్రయించే వ్యాపారులకు జీవిత ఖైదు విధిస్తారు. రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. కల్తీ ఆహారం తిని అనారోగ్యం కాకపోయినా సరే.. ఆహారంలో కల్తీ జరిగినట్లు నిర్థారణ అయితే చాలు..ఈ శిక్షలు విధించే విధంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టానికి సవరణ జరుగుతుంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ చట్టానికి సవరణ జరిగే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates