ఇక కాస్కోండి : రేపే కమల్ పార్టీ విడుదల

tamil-film-actor-kamal-haasan-pti-file_9e84e53a-68a7-11e7-95fb-ec6334583ea6

తమిళనాడులో కీలక పరిణామం. రాజకీయ పార్టీకి పుట్టింది. ప్రముఖ నటుడు కమలహాసన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం ఉదయం పార్టీ పేరు, జెండా, విధివిధానాలు విడుదల కాబోతున్నాయి. మధురైలోని భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు కమలహాసన్. ఈ బహిరంగ సభకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తోపాటు పలు రాష్ట్రాల్లోని ప్రముఖులు హాజరుకాబోతున్నారు. కలిసి వచ్చే వారు రావొచ్చని ఇప్పటికే ప్రకటించిన ఈ యూనివర్సల్ స్టార్.. తమిళనాడులోని సినీ, రాజకీయ ప్రముఖులను కలిసి పార్టీ ప్రారంభ కార్యక్రమానికి హాజరుకావాలని స్వయంగా కోరారు.

మధురై బహిరంగ సభలోనే పార్టీ పేరుతోపాటు జెండాను విడుదల చేయనున్నారు. ఎజెండాను ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు ఈ విషయాలపై చాలా గోప్యంగా ఉంచారు. అన్నీ రేపే చెబుతా అంటున్నారు. తనతో ఎవరెవరు తనతో కలిసి వస్తున్నారో ఆ రోజు ప్రకటిస్తానని వెల్లడించారు కమలహాసన్. మరోవైపు ఇప్పటికే పలువురు ప్రముఖులు కమల్ ని కలుస్తున్నారు. మద్దతు తెలుపుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates