ఇక చాలు ఆపండి : కొత్త సినిమాలపై నాగచైతన్య కస్సుబుస్సు

CHAITHUతన సినిమాలపై వస్తున్న ప్రచారాల్లో నిజం లేదన్నాడు హీరో నాగచైతన్య. తాను రెండు కొత్త  సినిమాలకు ఓకే చెప్పినట్లుగా  సోషల్ మీడియాలో వస్తున్న కథనాలన్నీ రూమర్సేనని కొట్టిపారేశాడు.  అవన్నీ వదంతులేనని.. వాటిని పట్టించుకోవద్దని తన అభిమానులకు  తెలిపాడు. కొత్త ప్రాజెక్టులు ఒప్పుకుంటే త్వరలోనే వెల్లడిస్తానన్న చైతూ… తన ప్రస్తుత మూవీ ప్రాజెక్టుల గురించి గురువారం (ఫిబ్రవరి-22) ట్విట్టర్ ద్వారా వివరించాడు.

సవ్యసాచితో పాటు డైరెక్టర్ మారుతితో చేస్తున్న మూవీల షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాను అని ట్విట్ చేశాడు. ఈ ఇయర్ తన వద్దకు మంచి స్క్రిప్ట్‌లు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఈ రెండు మూవీలు కాకుండా.. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న తన లేటెస్ట్ సినిమాల అప్‌డేట్స్ నిజం కాదని.. తన తర్వాతి ప్రాజెక్టుల గురించి త్వరలోనే వెల్లడిస్తానంటూ  ట్వీట్ చేశాడు.  చైతూ పోస్ట్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

Posted in Uncategorized

Latest Updates