ఇక చాలు.. ఆపండి : ప్రభాస్ – నీహారిక పెళ్లి వార్తలపై చిరంజీవి ఆగ్రహం

chiranjeevi-prabhas-niharikaబాహుబలి ప్రభాస్ – కొణిదెల నీహారిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.. రెండు కుటుంబాలు ఇప్పటికే మాట్లాడుతున్నాయి. చిరంజీవి పెద్ద తరహాగా.. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుతో మాట్లాడారు.. నాగబాబు ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంది.. ఇలాంటి వార్తలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ గాసిప్స్ లోనే కాకుండా.. హిందీ, ఇంగ్లీష్ తోపాటు ఇతర భాష వెబ్ సైట్లలో ఈ వార్త వైరల్ అయ్యింది. ఎన్డీటీవీ, ఇండియా టుడే లాంటి జాతీయ పోర్టల్స్ లోనూ ప్రముఖంగా వచ్చాయి. దీంతో ప్రభాస్ – నీహారిక పెళ్లి నిజమేనా అంటూ సినీ ఇండస్ట్రీ గుసగుసలాడుకుంటోంది. ఈ క్రమంలోనే.. కొణిదెల ఫ్యామిలీ ఈ వార్తపై స్పందించింది. ఇది తప్పుడు వార్త అని.. ఇలాంటి వార్తలు రాసే ముందు ఓసారి వివరణ కోరాల్సిన బాధ్యత మీడియాపై ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవన్నీ పుకార్లు. వీటిని ఎవరూ నమ్మొద్దు. ఇప్పటి వరకు అలాంటి ఆలోచన కూడా చేయలేదు. ఏమీ జరగలేదు. ఎవరూ కూడా మమ్మల్ని సంప్రదించకుండానే రాసేస్తున్నారు. కనీసం అవునా – కాదా అని కూడా అడగటం లేదు.. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రాసేస్తున్నారు అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ పత్రికల్లోనూ వీళ్లద్దరి పెళ్లి గురించి వార్తలు రావటంపై అసహనం వ్యక్తం చేశారు మెగాస్టార్. ఈ వార్త పూర్తిగా నిరాధారం అన్నారు. ప్రభాస్ వయస్సు 38. నీహారిక వయస్సు 24. ప్రస్తుతం వీళ్లద్దరి సినిమాల్లో బిజీగా ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates