ఇక చూస్తూ ఊరుకోం : పిల్లలకు బైక్ ఇస్తే పేరెంట్స్ జైలుకి

DCPహైదరాబాద్ సిటీలో ప్రమాదాలు తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ లతో ఇప్పటికే మందు బాబులకు చుక్కలు చూపెడుతున్న ట్రాఫిక్ పోలీసులు.. ఇప్పుడు కుర్రకారుపై స్పెషల్ డ్రైవ్ లు మొదలుపెట్టారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న కాలేజీ విద్యార్థులు, మైనర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సెల్ మాట్లాడుతూ, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బైక్ నడిపై వారిని పట్టుకునేందుకు స్పెషల్ డ్రైవ్ లు మొదలుపెట్టారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్ తో రోడ్డుపైకి వస్తే వదిలేది లేదంటున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసు పెట్టి జైలుకు పంపిస్తామని చెబుతున్నారు.

పక్కా ప్లాన్ తో కొత్త డ్రైవ్ స్టార్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. సిటీలోని కాలేజీలు, స్కూళ్ళు, షాపింగ్ మాల్స్ దగ్గర నిఘా పెడుతున్నారు. విద్యార్ధులు, మైనర్ల డ్రైవింగ్ పై కేసులు నమోదు చేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఈ రోజు ఉదయం 7గంటల నుండి 10 గంటల వరకు స్కూళ్ళు,కాలేజీల దగ్గర తనిఖీలు నిర్వహించారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. నాంపల్లి, కోఠి, మలక్ పేట్, కాచిగూడతో పాటు 8 ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో మూడు గంటల్లోనే 419 కేసులను నమోదు చేశారు. ఇందులో 191 మైనర్ డ్రైవింగ్ కేసులు కాగా 73 సెల్ ఫోన్, ఇయర్ ఫోన్ డ్రైవింగ్ కేసులు మరో 155 డ్రైవింగ్ లైసెన్స్ కేసులున్నాయి. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వీరిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates