ఇక టీవీ చూస్తాం : 15 ఏళ్ల తర్వాత గ్రామానికి కరెంట్

POWERనక్సల్స్ సమస్య కారణంగా చత్తీస్ గడ్ లోని అటవీ ప్రాంతాల్లో నిండిన చీకట్లు తొలగిపోతున్నాయి. అత్యంత వెనకబడిపోయిన సుక్మా జిల్లాల్లోని గ్రామాలు, గిరిజన గూడాల్లో వెలుగులు నిండుతున్నాయి. జిల్లాలోని చివరి గ్రామం వరకు పవర్ సప్లై లైన్స్ వేస్తోంది ప్రభుత్వం. నక్సలైట్లు ధ్వంసం చేసిన పోల్స్ ని పునరుద్దరిస్తోంది. మావోల ప్రభావం తీవ్రంగా ఉండే చింతల్నార్ గ్రామంలో ఇప్పుడు కరెంట్ వెలుగులు వచ్చాయి. 15 ఏళ్ల కిందటి వరకు కూడా ఇక్కడ కరెంట్ ఉండేది. నక్సలైట్లు విద్యుత్ సరఫరా వ్యవస్థను ధ్వంసం చేశారు. దీంతో 15 ఏళ్ళుగా గిరిజనుల జీవితాల్లో చీకట్లే మిగిలాయి. ఇప్పుడు ఆ చీకట్లను చీల్చుకుంటూ విద్యుత్ బల్బులు చింతల్ నార్ లో వెలిగిపోతున్నాయి. చిట్టచివరి గ్రామం వరకు కూడా పవర్ సప్లై అందిస్తామంటున్నారు సీఎం రమణ్ సింగ్.

కరెంట వచ్చింది కదా మీ ఫీలింగ్ ఏంటీ అని గ్రామస్తులను ప్రశ్నిస్తే ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందించారు. ఒక టీవీ చూస్తాం అంటే.. మరికొందరు ఫ్రిడ్జి వాడతాం అని చెప్పారు. మరికొందరు మహిళలు అయితే వంట గదిలోని ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేస్తాం అని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates