ఇక పై వీటికి ఆధార్ అవసరం లేదు: కేంద్రం

కొత్తగా బ్యాంక్ అకౌంట్ .. మొబైల్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా… అయితే ఇదివరకటిలా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం లేదంటోంది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రతిపాదనకు సంబంధించి మోడీ సర్కార్ టెలిగ్రాఫ్ చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరిగ్ చట్టాలను సవరించేందుకు ఓకే చెప్పింది.

అన్నిటికీ ఆధార్‌ను లింక్ చేయడంపై సుప్రీం కోర్టు సెప్టెంబర్‌లో తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పును అనుసరించే కేంద్ర ప్రభుత్వం చట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చట్ట సవరణలను ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఒక్కసారి ఈ సవరణలు ఆమోదం పొందితే బ్యాంకులకు, మొబైల్ ఫోన్ కనెక్షన్‌లకు ఆధార్ కార్డులు ఇవ్వాలా వద్దా అనేది కస్టమర్ ఇష్టం పై నే ఆదార పడి ఉంటుంది. ఆదార్ సమాచారం ప్రైవేట్ పార్టీలు తీసుకోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెప్టెంబర్‌లో ఆధార్ చట్టంలోని సెక్షన్ 57ను కొట్టివేసింది. దీంతో ఆధార్ నెంబర్ ఆధారంగా వ్యక్తిగత విషయాలు లేదా గోప్యతగా వహించాల్సిన విషయాలపై దృష్టి సారిస్తే వారికి 10 ఏళ్లు జైలుశిక్ష విధించేలా చట్టసవరణ చేయనుంది కేంద్రం.

ఒక్క ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో తప్ప ఇన్‌కంటాక్స్ రిటర్న్స్, పాన్ నంబర్ కేటాయింపులాంటి వాటికి ఆధార్‌ అవసరం లేదని సుప్రీం కోర్టు తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates