ఇక భారత్ లోనే : ఢిల్లీ ముండ్కా-బహుదూర్ ఘర్ మెట్రో గ్రీన్ లైన్ ప్రారంభించిన మోడీ

modiఢిల్లీ ముండ్కా-బహుదూర్ ఘర్ మెట్రో రైల్వే గ్రీన్ లైన్ ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇనాగరేట్ చేశారు మోడి. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ-హర్యానా ప్రజలకు అభినందనలు తెలిపారు. ఢిల్లీ మెట్రోతో బహదూర్ ఘర్ కనెక్ట్ అవడం చూస్తుంటే సంతోషం ఉందన్నారు. హర్యానా నుంచి ఢిల్లీ మెట్రోతో గుర్గామ్, ఫరీదాబాద్ కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు బహదూర్ ఘర్ తో ఆ సంఖ్య మూడుకు చేరిందన్నారు.ఇన్నేళ్లు ఇతర దేశాల సహాయంతో మెట్రో కోచ్ లను తయారుచేసుకున్నామని.. ఇక నుంచి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా.. దేశంలోనే వాటి తయారీని చేపడతామన్నారు ప్రధాని. ప్రజలంతా తమ సొంత వాహనాలను పక్కనపెట్టి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

Posted in Uncategorized

Latest Updates