ఇక మండే రోజులే : ఎండాకాలం మొదలైంది ఇలా..

summer-2018రాష్ట్రంలో ఎండల సీజన్ మొదలైంది. సమ్మర్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. నాలుగు రోజులుగా వేడి పెరుగుతూ ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. రాత్రులు చలి తగ్గిపోయింది. ఆకాశంలో మబ్బులు కూడా లేకపోవటంతో వేడి తీవ్రత ఎక్కువగా అనిపిస్తోంది. హైదరాబాద్ లో సోమవారం గరిష్ఠం 33 డిగ్రీలుగా ఉంది. రాబోయే వారం రోజుల్లో 2డిగ్రీలు పెరిగి.. 35 వరకు చేరుకోవచ్చు. గాల్లో తేమ కూడా తక్కువగా ఉంది. డ్రై వెదర్ నడుస్తోంది.

మూడు రోజులుగా మండే ఎండలు వచ్చేశాయి. 24 గంటల్లో.. రాష్ట్రంలో మహబూబ్ నగర్ లో అత్యధికంగా 37 డిగ్రీలు నమోదు అయ్యింది. సోమవారం కూడా ఫిబ్రవరి నెలలో ఇంత ఎండ రావటంతో.. ఎండాకాలం ముందే వచ్చినట్లు అయ్యింది. ఇక భద్రాచలంలో 35డిగ్రీలు, హైదరాబాద్, ఖమ్మం, మెదక్, రామగుండంలో 34 డిగ్రీలు నమోదు అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువగా టెంపరేచర్ నమోదు అవుతుంది. రాబోయే వారం రోజుల్లో చిరుజల్లులు పడే అవకాశం కూడా లేదు.

Posted in Uncategorized

Latest Updates