ఇక ముంబై టీ20 లీగ్ : బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్

SACHINMదేశంలో క్రికెట్ లీగ్ ల జోరు నడుస్తోంది. తమిళనాడు, కర్నాటకలో రీజినల్ లీగ్స్ హిట్టవడంతో… వాటి తరహాలోనే డొమెస్టిక్ లీగ్స్ కి ప్లాన్ చేస్తున్నారు. మహారాష్ట్రలో టీ20 ముంబై పేరుతో టోర్నీ నిర్వహించబోతున్నారు. లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు దీన్ని చేపడుతున్నట్టు ప్రకటించారు నిర్వహకులు. ముంబై లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ వ్యవహరిస్తున్నాడు.

మార్చి 11 నుంచి 21 దాకా వాంఖడే స్టేడియంలో టీ20 ముంబై లీగ్ జరుగుతుంది. ఈ లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా భాగమైనందుకు సంతోషంగా ఉందని.. తన పాత రోజులను గుర్తుచేసుకున్నాడు మాస్టర్. తమ సత్తా చాటేందుకు కుర్రాళ్లకు ఇది చక్కని వేదిక అని తెలిపిన సచిన్..  ముంబై గల్లీ కుర్రాళ్లు శివాజీ పార్క్, క్లబ్‌ల స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వేదికైన వాంఖెడేలో మెరిసేందుకు ఇది మంచి అవకాశమన్నారు.

Posted in Uncategorized

Latest Updates