ఇక విద్యార్థినులకు హెల్త్ కిట్లు

kcr-kit
ప్రజలకు మెరుగైన వైద్య సౌరక్యం అందించడంతో పాటు…ఇందుకు అవసరమైన వసతులను చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ అయిన మహిళల కోసం ఇస్తున్న కేసీఆర్ కిట్లను ఇకపై ఆడపిల్లలకు అందించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు సర్కార్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థినీ,విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ ను సిద్ధం చేయాలని..అవసరం అయినప్పుడు వారికి తగిన వైద్య సాయం అందించేందుకుగాను ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీంతో పాటు హైస్కూల్ విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్లతో పాటు ఇతర వస్తువులు ఉన్న హెల్త్ కిట్లను అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులందరి ఆరోగ్య సమాచారం నమోదు చేయాలని నిర్ణయించింది. ఈ విధానంతో 30 లక్షల మంది విద్యార్ధినీ,విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వ స్కూళ్లలో ఎక్కువగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థినీ ,విద్యార్థులే చదువుకుంటారు. వారందరికీ ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంచడానికి చర్యలు చేపట్టారు అధికారులు ఇందులో భాగంగానే వారికి ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించి..ఆరోగ్య సమాచారంతో కూడిన ప్రొఫైల్ ను ఎప్పటికప్పుడు సిద్ధం చేయనున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ తో ముందుగానే వారికి ఎలాంటి వ్యాధులు రాకుండా చూడవచ్చు.

బాలికల్లో.. అందులోనూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారిలో వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ గురించి కూడా ప్రభుత్వం యోచిస్తోంది. కిశోర బాలికలకు వ్యక్తిగత ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో భాగంగా 8,9,10 తరగతులకు చెందిన బాలికలకు శానిటరీ నాప్కిన్లతో సహా హెల్త్ కిట్లను అందజేయాలని నిర్ణయించింది. హెల్త్ కిట్లకు అయ్యే ఖర్చు, కిట్లలో శానిటరీ నాప్కిన్లతో పాటు ఏయే వస్తువులు చేర్చాలన్న దానిపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. హెల్త్ కిట్ల పథకం అమల్లోకి వస్తే ప్రభుత్వ స్కూళ్లలో చవివే బాలికలకు ప్రయోజనం చేకూరుతుంది.

Posted in Uncategorized

Latest Updates