ఇక విశ్వరూపం : కలాం ఇంటి నుంచి కమల్ యాత్ర

kamal
రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ …తన రాజకీయ యాత్రను బుధవారం (ఫిబ్రవరి-21)  ప్రారంభించారు. అంతకు ముందుగా బుధవారం ఉదయం  మాజీ రాష్ట్ర పతి అబ్దుల్‌ కలాం సమాధిని దర్శించుకున్నారు. కలాం సమాధికి అంజలి ఘటించారు. అబ్దుల్‌ కలాం ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను కలిశారు.తర్వాత అక్కడి నుంచి కమల్‌ రాజకీయ యాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా రామేశ్వరం, పరమకొడి, మదురైలో జరిగే బహిరంగ సభల్లో కమల్ పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం మదురైలో జరిగే సభలో పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించనున్నారు. పార్టీ ప్రారంభ వేడుకకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరు కానున్నారు.

Posted in Uncategorized

Latest Updates