ఇచ్చింది గూగుల్ : 13 ఏళ్ల పిల్లోడికి రూ.8 కోట్ల జీతం

googleకేవలం 13 ఏళ్ల వయసులోనే అత్యంత ప్రముఖ గూగుల్ కంపెనీలో నెలకు రూ.66 లక్షలు నెల జీతం పొందాలంటే కష్టమే. కానీ ఒక ఇండియన్ చిన్నోడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. 2003లో పుట్టిన తన్మయ్ భక్షి.. కోడింగ్ కు సంబంధించి అనేక యాప్ లను తయారు చేశాడు. ఒక సాఫ్ట్ వేర్ డెవలపర్. ఇతని కుటుంబం 2004లో ఇండియా నుంచి కెనడాకి వలస వెళ్లింది. తన్మయ్ తండ్రి ఒక ప్రముఖ కంపెనీలో కంప్యూటర్ ప్రోగ్రామర్. 13 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు స్నేహితులతో ఆటలు ఆడుతూ బిజీగా ఉంటారు.

కెనడాలోని బ్రాంప్టన్లోని భారతీయ సంతతికి చెందిన తన్మయ్ భక్షి.. ఇప్పటికే అల్గోరిథంలను రూపొందిస్తున్న సాఫ్ట్ వేర్ కంటెంట్ డెవలపర్ గా ఎదిగాడు. ఖాళీ సమయంలో కంప్యూటర్ ప్రోగ్రామ్స్ రాసి ప్రపంచంలో తక్కువ వయస్సున్న.. IBM వాట్సన్ ప్రోగ్రామర్ గా పేరుపొందాడు. బక్షి ఒక పుస్తకాన్ని రాశాడు. IBM వాట్సన్ లో ఇతను రెండో బుక్ ను రాస్తున్నాడు. స్కూల్ కు వెళ్లకుండానే ఇంట్లోనే చదువుకుంటున్నాడు తన్మయ్ భక్తి.

తన్మయ్ భక్షి ..’తన్మయ్ టీచర్స్’  పేరుతో ఓ యూ ట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తున్నాడు. ఆరేళ్ల కిందటే ఈ ఛానల్  ప్రారంభించాడు. కేవలం 5 ఏళ్ళ వయసులో కోడింగ్ ప్రారంభించాడు. 9 సంవత్సరాల వయస్సులో టీ టాబ్లెస్ అనే ఐఫోన్ కోసం తన మొట్టమొదటి ప్రయోగాన్ని అభివృద్ధి చేశాడు. ఖాళీ సమయంలో టేబుల్ టెన్నిస్ ఆడటంతో పాటు.. ఇంట్లో ఒక్కడే ఉండటానికి ఇష్టపడతాడట తన్మయ్. 13 ఏళ్లకే.. ఏడాదికి రూ.8 కోట్ల ప్యాకేజీ తీసుకుని వరల్డ్ రికార్డ్ సృష్టించాడు..

Posted in Uncategorized

Latest Updates