ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులు తిరిగి తీసుకోవచ్చు: హైకోర్టు

వారసత్వంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు వారికి ఉందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. జీవితం చివరి దశలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోని వారిని…మాటలతో, చేతలతో హింసించే వారికి కోర్టు తీర్పుతో షాక్ ఇచ్చింది. పిల్లలకు ఇచ్చిన ఆస్తిలో కొంత బాగాన్ని తిరిగి తీసుకుని హక్కు పేరెంట్స్ కు ఉంటుందని…జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ అనుజా ప్రభుదేశాయ్‌ల నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

ముంబైలోని అంధేరికి చెందిన ఓ వృద్ధుడు తన ఫ్లాట్‌లో 50 శాతం భాగాన్ని కుమారుడికి గిఫ్ట్ డీడ్ పేరుతో రాసిచ్చిన అగ్రిమెంట్ పేపర్ ను ట్రిబ్యునల్ రద్దుచేయడాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ సందర్భంగా అమ్మానాన్నలు, వయోవృద్ధుల సంక్షేమకోసం తీసుకువచ్చిన.. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్స్ నిర్వహణ, సంక్షేమ చట్టం-2007ను ధర్మాసనం ప్రస్తావించింది.

ప్రస్తుతం తాము ఉంటున్న ఫ్లాట్‌ను గిఫ్ట్ డీడ్ కింద తన పేరుతో బదలాయిస్తే తండ్రితోపాటు, అతడి రెండో భార్య బాగోగుల్ని చూసుకుంటానని కుమారుడు, కోడలు చెప్పారు. కానీ, ఆ తండ్రి 50 శాతం వాటాను మాత్రమే కుమారుడికి బదలాయించాడు. దీంతో సవతి తల్లిని సాకుగా చూపుతూ వారిద్దరి బాగోగుల్ని కుమారుడు, కోడలు నిర్లక్ష్యంచేశారు. ఈ అగ్రిమెంట్‌ను ట్రిబ్యునల్ రద్దుచేయడంలో మాకు ఎలాంటి తప్పు కనిపించడం లేదు అని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates