ఇటలీలో సత్తాచాటిన తెలంగాణ జూనియర్ కిక్ బాక్సర్లు

ఢిల్లీ : ఇట‌లీలో జ‌రిగిన వ‌ర‌ల్డ్ కిక్ బాక్సింగ్ చాంపియ‌న్ షిప్ పోటీల్లో తెలంగాణ జూనియర్ క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 13 నుంచి 23 వ‌ర‌కు ఇటలీలోని వెనీస్ నగరం వేదిక‌గా వ‌ర‌ల్డ్ కిక్ బాక్సింగ్ చాంపియ‌న్ షిప్ జరిగింది. క్రెడిట్, జూనియ‌ర్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఇండియా నుంచి ఈ పోటీల్లో 15 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. భారత్ కు మొత్తం 3 మెడ‌ల్స్ వచ్చాయి. ఈ మూడు కూడా తెలంగాణ అమ్మాయిలకే దక్కడం విశేషం. ఇందులో.. రెండు గోల్డ్, ఒక బ్రాంజ్ మెడ‌ల్ ఉన్నాయి.

మంచిర్యాలకు చెందిన పదేళ్ల అమ్మాయి.. పెండం చంద‌న 2 గోల్డ్ మెడల్స్ గెల్చుకుంది. హైదరాబాద్ కు చెందిన అప్పునీతల మైత్రి కాంస్య(బ్రాంజ్) పతకం దక్కించుకుంది. మ్యూజికల్ ఫామ్ లో, మ్యూజిక‌ల్ వెప‌న్ ఫామ్ లో రెండు గోల్డ్ మెడ‌ల్స్ ద‌క్క‌డం సంతోషంగా ఉందని చందన చెప్పింది. చాలా ట‌ఫ్ ఫైట్ ను ఎదుర్కొన్నానంది. ఇప్పటికే జాతీయ స్థాయి పోటీల్లో సిల్వ‌ర్, బ్రాంజ్ మెడ‌ల్స్ అందుకున్నానని… అంతర్జాతీయ వేదికపై గోల్డ్ మెడల్స్ గెలవడం సంతోషంగా ఉందని చందన చెప్పింది. మ్యూజికల్ ఫామ్ లో ఒలింపిక్స్ లో భార‌త్ కు గోల్డ్ మెడ‌ల్ తీసుకురావడమే తన లక్ష్యం అని చందన చెప్పింది.

కిక్ బాక్సింగ్ లోనే మరో ఈవెంట్ లో బ్రాంజ్ మెడల్ గెల్చుకున్నానని హైదరాబాద్ కు చెందిన మైత్రి చెప్పింది. ర‌ష్యా, గ్రీస్, స్లోవెనియా దేశాల‌ జూనియర్ క్రీడాకారులతో గ‌ట్టి పోటీ ఎదుర్కొన్నానంది. ఈ పోటీల‌ తనలో ఆత్మ విశ్వాసం నింపాయంది. దేశంలోనే తెలంగాణ చిన్నారులు కిక్ బాక్సింగ్ అంత‌ర్జాతీయ వేదికలపై స‌త్తా చాటుతున్నారని కోచ్ , టీఎస్ కిక్ బాక్సింగ్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, ఇట‌లీ చాంపియ‌న్ షిప్ రెఫరీ రామాంజనేయలు అన్నారు. గ‌తంలో రష్యాలో జరిగిన పోటీల్లో తెలంగాణకు రెండు గోల్డ్ మెడ‌ల్స్ ద‌క్కాయన్నారు.

జాతీయ స్థాయిలో కిక్ బాక్సింగ్ కు తెలంగాణ కేరాఫ్ గా నిలుస్తుండ‌డం హ్యాపీగా ఉందన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రింతంగా స‌హ‌క‌రిస్తే, అంత‌ర్జాతీయ స్థాయిలో తెలంగాణతో పాటు.. భార‌త ఖ్యాతి చాటుతామన్నారు రామాంజనేయులు.

Posted in Uncategorized

Latest Updates