ఇటలీ నైట్ క్లబ్ లో తొక్కిసలాట : ఆరుగురి మృతి

 సరదాలు ఒక్కోసారి విషాదాలుగా మారుతాయి.. ఊహించని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. శనివారం తెల్లవారుజామున ఇటలీ నైట్ క్లబ్ లో తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో ఆరుగురు యువకులు చనిపోయారు. నైట్‌క్లబ్‌లో ప్రముఖ ఇటాలియన్ ర్యాప్ సింగర్ స్ఫెరా ఎబస్టా ప్రదర్శన జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పాటల హోరులో అంతా చిందేస్తున్న సమయంలో ఏదో గాఢమైన వాసన వచ్చి.. గుచ్చుకునే స్వభావమున్న ఒక వస్తువు నేలపై కనబడటంతో అంతా భయపడి బయటకు పరుగులు తీసారు. దీంతో తొక్కిసలాట జరిగిందని ఇటలీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 120 మంది వరకూ గాయపడినట్టు ఇటాలియన్ న్యూస్ ఏజెన్సీ ‘అన్సా’ తెలిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు గాయపడినవారిని దవాఖానాకు తరలించారు.

Posted in Uncategorized

Latest Updates