ఇటాలియన్ ఓపెన్ లో జోరు కొనసాగిస్తున్న నాదల్

VEDUKAఇటాలియన్ ఓపెన్ లో స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ జోరు కొనసాగుతోంది. నిన్న జరిగిన పురుషుల క్వార్టర్స్ లో ఇటలీ ఆటగాడు ఫాబియో ఫోగనినిపై 4-6, 6-1, 6-2తో విజయం సాధించి క్లే కోర్టులో ఎదురులేదని నిరూపించుకున్నాడు నాదల్. తొలిసెట్ లో 4-6 తో ఓటమితో ఒక్కసారిగా జూలు విదిల్చాడు. వరుసగా రెండు సెట్లను భారీ తేడాతో ముగించి సెమీస్ చేరుకున్నాడు.

Posted in Uncategorized

Latest Updates