ఇట్స్ అఫిషీయల్ : భరత్ బహిరంగ సభకు ఎన్టీఆర్

NTR-Chief-Guest-Bharat-Ane-కొరటాల శివ డైరెక్షన్ లో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను ఏప్రిల్ 20న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. దీంతో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సినిమా యూనిట్..ఆడియో వేడుక పనుల్లో ఉంది. శనివారం (ఏప్రిల్-7) హైదరాబాద్ లోని LB స్టేడియంలో ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుక జరగనుంది. ఈ ఆడియో వేడుకకు జూనియర్‌ ఎన్టీఆర్‌ చీఫ్‌ గెస్ట్‌గా రాబోతున్నాడన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించేశారు.
ఇటీవల ఈ ఆడియోకు ఎన్టీఆర్‌తోపాటు రామ్‌ చరణ్‌ కూడా వస్తాడన్న ప్రచారం జరిగింది. అయితే చెర్రీ సంగతి ఏమోగానీ.. భరత్‌ బహిరంగ సభకు ప్రేమతో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అంటూ శుక్రవారం (ఏప్రిల్-6) పోస్టర్‌ను రిలీజ్ చేసింది యూనిట్. మహేష్ సరసన కైరా అద్వాని హీరోయిన్ గా నటించిన భరత్‌ అనే నేనుకు దేవీశ్రీప్రసాద్‌ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates