ఇట్స్ అఫీషియల్ : ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్టర్ ఫిక్స్

BALAKRISHNAబాలకృష్ణ హీరోగా నటించనున్న ఎన్టీఆక్ బయోపిక్ పై డైరెక్టర్ ఎవరన్నదానిపై రకరకాల పేర్లు వినిపించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు బాలకృష్ణ. ఈ విషయాన్ని ఆదివారం (మే-27) అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ కథ ఎవరు చెప్పాలని రాసుందో, ఈ రామాయణానికి వాల్మికి ఎవరో ఇప్పుడు తెలిసింది. నాన్నగారి ఆత్మ ఆశీర్వదిస్తుంది… అంటూ బాలయ్య డైలాగ్ తో వీడియోను విడుదలచేశారు.

బాలకృష్ణ హీరోగా, నిర్మాతగానూ వ్యవహరిస్తోన్న ఎన్టీఆర్‌ బయోపిక్‌.. రెండు నెలల క్రితం ప్రారంభం కావడం, దర్శకుడు తేజా అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో బాలకృష్ణే దర్వకత్వ బాధ్యతలు చేపట్టాలని డిసైడ్‌ అయ్యారు. అనేక చర్చోపచర్చల తర్వాత చివరికి క్రిష్‌ను దర్శకుడిగా ఖరారుచేశారు. క్రిష-బాలకృష్ణ కాబినేషన్‌లో వచ్చిన చారిత్రక మూవీ శాతకర్ణి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates