ఇట్స్ అఫీషియల్ : తేజ్ రిలీజ్ డేట్ ఫిక్స్

TEJకరుణాకరన్ డైరెక్షన్ లో మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన మూవీ తేజ్. కేఎస్ రామారావు నిర్మించిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. తేజ్ సినిమాను జూన్ -29న రిలీజ్ చేస్తున్నట్లు బుధవారం (మే-23) ట్విట్టర్ ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది యూనిట్.

సాయి ధరమ్ తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మంచి లవ్ స్టోరీగా నిలుస్తుందని తెలిపింది. తొలిప్రేమ, ఉల్లాసంగా ఉత్సహంగా, డార్లింగ్ వంటి లవ్ స్టోరీ సినిమాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ కరుణాకరన్ తేజ్ సినిమా తీయడంతో..ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్నా ఈ మూవీ ఆడియో తదితర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates