ఇట్స్ అఫీషియల్ : భరత్ వచ్చేస్తున్నాడు

HHప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భరత్ అనే నేను రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది సినిమా యూనిట్.  శ్రీమంతుడుతో సూపర్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో మహేష్ చేస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 26న రిలీజ్ కానున్నట్లు ఇంతకుముందే తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇదే డేట్ ను బుధవారం (ఫిబ్రవరి-14) అఫిషియల్ అనౌన్స్ చేశారు.  రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా మ‌హేష్ ప్ర‌మాణ స్వీకారానికి సంబంధించి ఓ లిరిక‌ల్ వీడియో విడుద‌ల చేశారు.

ఈ వీడియో మ‌హేష్ అభిమానుల‌లో ఆనందం క‌లుగ జేసింది. ఆ త‌ర్వాత కొద్ది సేప‌టికి స్టైలిష్ లుక్‌లో ఉన్న మ‌హేష్ ఫోటో ఒక‌టి విడుద‌ల చేశారు .క్లాస్ లుక్‌లో బ్రీఫ్ కేసు ప‌ట్టుకొని న‌డుస్తున్న మ‌హేష్ ని చూసి యంగ్ అండ్ స్టైలిష్ ముఖ్య‌మంత్రి అంటూ త‌న అభిమాన న‌టుడిని పొగిడేశారు. ఇక త్వ‌ర‌లోనే టీజ‌ర్ విడుద‌ల కానుంద‌ని తెలుస్తుండ‌గా, దీని కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా మూవీ రిలీజ్ డేట్‌పై అభిమానుల‌లో సందిగ్ధం నెలకొన‌గా, దీనిపై క్లారిటీ ఇచ్చింది  యూనిట్‌. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ మూవీ.. ఆ త‌ర్వాత పూణేలో కంటిన్యూ షెడ్యూల్ జ‌రుపుకోనుంది. మార్చి 27 వ‌ర‌కు సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంద‌ట‌. దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో కైరా అద్వానీ హీరోయిగా న‌టిస్తుంది.

Posted in Uncategorized

Latest Updates