ఇట్స్ అఫీషియల్.. భారత్ లో వేగవంతమైన రైలుగా ట్రైన్ 18

భారత్ లో ఇప్పటి దాకా టాప్ సెమీ స్పీడ్ ట్రైన్ గా ఉన్న గతిమాన్ ఎక్స్ ప్రెస్ రికార్డ్ ను మేకిన్ ఇండియాలో భాగంగా తయారు చేసిన ఫస్ట్ ఇంజన్ లెస్ రైలు.. ట్రైన్ 18 బ్రేక్ చేసింది. ట్రయల్ రన్ లో ఈ ట్రైన్ 180 కిలోమీటర్ల స్పీడ్ ను విజయవంతంగా అందుకుందని రైల్వే మినిస్టర్ పియూష్ గోయల్ ట్వీట్ చేశారు. అధికారికంగా ట్రైన్18 ఇండియాలోనే టాప్ స్పీడ్ ట్రైన్ అని ఆయన ట్వీట్ లో తెలిపారు. బుల్లెట్ ట్రైన్ లా కనిపించే ఈ ట్రైన్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

రెండు ఎగ్జిక్యుటివ్ కోచ్ లతో కలిపి ఈ ట్రైన్ లో మొత్తం  16 కోచ్ లు ఉన్నాయి. అన్ని కోచ్ లను ఏసీతో డిజైన్ చేశారు.   దీనిలోని  సీట్లు 360 డిగ్రీస్ రోటేట్ అవుతాయి. ప్రతీ కోచ్ లో వైఫై, వాక్యూమ్‌ టాయిలెట్స్‌, స్లైడింగ్‌ డోర్స్ తో పాటు CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు. మెట్రో ట్రైన్ లో ఉన్నట్లే ఈ ట్రైన్ లో కూడా ఆటోమెటిక్‌ డోర్స్ ఉన్నాయి. దీని నిర్మాణానికి దాదాపు రూ.100కోట్లు ఖర్చయ్యింది.

 

Posted in Uncategorized

Latest Updates