ఇట్స్ అఫీషియల్ : మహేష్ సినిమాలో నరేష్

mahesh-and-allari-nareshఅల్లరి నరేష్ లక్కీ చాన్స్ కొట్టేశాడు. నరేష్ బర్త్ డే సందర్భంగా ఈ అల్లరి హీరోకు సూపర్ గిఫ్ట్ అందించాడు వంశీపైడిపల్లి. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నరేష్ కు అవకాశం ఇస్తున్నట్లు శనివారం (జూన్-30) ట్విట్టర్ ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు వంశీ. శనివారం నరేష్‌ పుట్టినరోజు సందర్భంగా వంశీ పైడిపల్లి ట్వీట్‌ చేశారు.

మా రవికి హ్యాపీ బర్త్‌డే. నీతో కలిసి పనిచేయడం అద్భుతంగా అనిపిస్తోంది. ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలని మహేశ్‌ 25వ సినిమా యూనిట్ కోరుకుంటోంది అని ఆయన ట్వీట్‌ చేశారు.  మహేష్ బాబు, పూజా హేగ్దే జంటగా నటిస్తున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లరి నరేష్ నటిస్తాడని చాలా రోజులుగా వార్తలు రాగా, ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది యూనిట్. అల్లరి నరేష్‌ మరోపక్క సునీల్ తో సిల్లీ ఫెలోస్‌ అనే సినిమాలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కంప్లీగా కాగానే మహేష్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.

Posted in Uncategorized

Latest Updates