ఇట్స్ అఫీషియల్ : విశ్వరూపం-2 రిలీజ్ డేట్ ఫిక్స్

KAMALకమల్ హాసన్ హీరోగా నటించిన విశ్వరూపం-2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్న ఈ సినిమా అనివార్యకారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే సోమవారం (జూన్-11) ఈ సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది యూనిట్.  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 10న ఈ సినిమా ప్రేక్షకులముందుకు రానున్నట్లు తెలిపారు కమల్‌. ఈ సినిమా ట్రైలర్ ఈ సాయంత్రం (సోమవారం-జూన్-11) రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

తమిళ్‌, హిందీలో ఒకేసారి  సినిమా తెరకెక్కగా.. తెలుగులో డబ్‌ కానుంది. సాయంత్రం 5 గంటలకు తెలుగు ట్రైలర్‌ ను ఎన్టీఆర్‌, తమిళ ట్రైలర్‌ ను కమల్‌ తనయ శృతిహాసన్‌, హిందీ ట్రైలర్‌ ను అమీర్‌ ఖాన్‌ విడుదల చేస్తారని ట్విట్ చేశారు కమల్. వివాదాల నడుమే విడుదలైన మొదటి పార్ట్‌ కు మంచి స్పందన కాగా, రెండో భాగం మాత్రం జాప్యం అవుతూ వస్తోంది. కమల్‌ రాజకీయ ఆరంగ్రేటం తర్వాత విశ్వరూపం-2  విడుదల అన్ని వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.  కమల్ డైరెక్షన్‌ లో తెరకెక్కిన ఈ మూవీలో పూజా కుమార్‌, ఆండ్రియా హీరోయిన్లు కాగా, గిబ్రాన్‌ మ్యాజిక్ అందించిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates