ఇట్స్ అఫీషియల్ : వెంకీ, వరుణ్ సినిమా టైటిల్ ఫిక్స్

VENKYవిక్టరీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీ స్టార‌ర్ తెర‌కెక్క‌తున్న విషయం తెలిసిందే. శ్రీరామనవమి కానుకగా ఆదివారం (మార్చి-25) ఈ మూవీకి సంబంధించి అఫీషియ‌ల్‌ ప్రకటన చేశారు మేకర్స్.

వెంకీ, వ‌రుణ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి తెర‌కెక్కించ‌బోయే మ‌ల్టీస్టార‌ర్ సినిమాకి ఎఫ్2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్)అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన ఓ స్టిల్ ను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు హీరో వరుణ్. జూలై నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుంది. వరుణ్ తేజ్ పక్కన హీరోయిన్ గా మెహ్రీన్ ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దిల్ రాజు నిర్మించ‌నున్న ఈ సినిమా.. ఫుల్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం వెంక‌టేష్ ఆట‌నాదే వేట‌నాదే సినిమాతో బిజీగా ఉన్నాడు. అంత‌రిక్షం ఆధారంగాలో సంక‌ల్ప్ రెడ్డి తీయ‌బోవు సినిమా కోసం వ‌రుణ్ తేజ్ ప్రిపేర్ అవుతున్నాడు. హ్య‌ట్రిక్ విజ‌యాలు సాధించిన అనీల్ రావిపూడి ఎఫ్‌2 మూవీతో మ‌రో విజయాన్ని త‌న ఖాతాలో వేసుకుంటాడా అనేది చూడాలి.

Posted in Uncategorized

Latest Updates