ఇట్స్ అఫీషియల్ : శ్రీనివాస కల్యాణం రిలీజ్ డేట్

SRINIVASA KALYANAMవేగేశ్న సతీష్ డైరెక్షన్ లో నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా శ్రీనివాస కల్యాణం. ఈ సినిమా రిలీజ్ డేట్ ను బుధవారం (జూలై-4) ట్విట్టర్ ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది యూనిట్. శ్రీనివాస కల్యాణం ఆగస్టు 9న ప్రేక్షకులముందుకు తీసుకురానున్నట్లు తెలుపుతూ మూవీలోని ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఇందులో నితిన్ పెళ్లి సీన్ బాగుంది. నితిన్ సరసన రాశీఖన్నా, నందితా శ్వేత హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీవెంకటేశ్వర బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆడియో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నట్లు తెలిపింది సినిమా యూనిట్.

Posted in Uncategorized

Latest Updates