ఇట్స్ అఫీషియల్ : IPL -2018 షెడ్యూల్ విడుదల

 

IPL -11క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న IPL -2018 సీజన్ -11కి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ సారి వేలంలో కోట్లు కొల్లగొట్టిన ప్రాంచైజీలు.. తమ క్రికెటర్లపై ధీమాగా ఉన్నారు. ఏప్రిల్ -7 నుంచి ప్రారంభమయ్యూ IPL- 2018కి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది BCCI.  టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్ల మధ్య పోరుతో కొత్త సీజన్‌ ఆరంభం కానుంది.

రెండేళ్ల విరామం తర్వాత బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌… అత్యధికంగా మూడుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌తో ఫస్ట్ మ్యాచ్  పోటీ పడనుంది. ముంబై వాంఖడే స్టేడియంలో ఏప్రిల్‌ 7న చెన్నై-ముంబై పోరుతో లీగ్‌ మొదలవనుంది. ఒక రోజు ముందు (ఏప్రిల్‌ 6) ముంబైలోనే ఆరంభ వేడుకలను అంగరంగ వైభవంగా జరగనున్నాయి.  సర్వత్రా ఆసక్తి రేపిన మ్యాచ్‌ సమయాల్లో మార్పులు జరగలేదు. గత సీజన్‌ మాదిరిగానే తొలి మ్యాచ్‌ 4 గంటలకు, రెండో మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు మొదలవనుంది. మ్యాచ్‌ వేళలు మార్చాలని ప్రసారదారు విజ్ఞప్తి చేసినా.. మెజారిటీ ఫ్రాంచైజీలు, యాభై శాతం వాటాదారుల నుంచి వ్యతిరేకత రావడంతో పాత టైమింగ్స్‌నే కొనసాగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు 11వ సీజన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. IPL అఫీషియల్  వెబ్‌సైట్‌లో షెడ్యూల్‌ను ఉంచింది.

పూర్తి షెడ్యూల్ వివరాలను ఇక్కడ చూడండి..

Posted in Uncategorized

Latest Updates