ఇట్స్ అఫీషియల్ : SRH కెప్టెన్ గా విలియమ్సన్

KANEIPL-సీజన్-11 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్ బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఈ న్యూజిలాండ్ క్రికెటర్ గత సీజన్‌లోనూ హైదరాబాద్ తరపున ఆడాడు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో సంవత్సరం పాటు నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. దీంతో SRH కెప్టెన్ గా విలియమ్సన్ ని సెలక్ట్ చేసినట్లు గురువారం (మార్చి-29) ట్విట్టర్ ద్వారా వెల్లడించింది SRH యాజమాన్యం.

కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు విలియమ్సన్ తెలిపాడు. ఏప్రిల్ 7 నుంచి ప్రారంభంకానున్న IPL సీజన్‌లో భాగంగా సన్‌ రైజర్స్‌ తన తొలి మ్యాచ్‌ను రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. ఏప్రిల్‌ 9 వ తేదీన సన్‌ రైజర్స్‌ ..రాజస్తాన్‌తో మొదటి మ్యాచ్‌ను ఆడనుంది. ట్యాంపరింగ్‌ ఉదంతంతో రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్టీవ్‌ స్మిత్‌ కూడా వైదొలిగిన సంగతి తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates